నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగాపురం గ్రామంలో నూతన ప్రభుత్వ సంక్షేమ పథకమైన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కుటుంబ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో భరోసానిస్తుందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & AMC వైస్ చైర్మన్ శ్రీ శాకమూరి హరిబాబు గారు, ఖానాపూర్ మండల PACS చైర్మన్ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి శ్రీ వల్లే శ్రీనివాస్ యాదవ్ గారు, ఖానాపూర్ MRO శ్రీ రమేష్ గారు, ఖానాపూర్ మండల MPDO శ్రీమతి అద్విత గారు, స్పెషల్ ఆఫీసర్ DTDO శ్రీ నారాయణరెడ్డి గారు, రంగాపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి పిండి అనూష కుమార్ గారు, కార్యదర్శి అభేద బేగంగారు,ఉప సర్పంచ్ శ్రీ సోగాల ఉపేంద్ర గారు, వార్డు సభ్యులు శ్రీ భుక్య నర్సింహ గారు, శ్రీమతి తాళ్ల రాణి గారు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్