Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

పింఛన్ బాండ్ల పంపిణీకి కదిలిన కున్సి కాంగ్రెస్ బలగం.. మక్తల్‌కు భారీగా తరలివెళ్లిన నాయకులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పింఛన్ బాండ్ల పంపిణీకి కదిలిన కున్సి కాంగ్రెస్ బలగం.. మక్తల్‌కు భారీగా తరలివెళ్లిన నాయకులు!

మక్తల్‌లోని ద్వారక ఫంక్షన్ హాల్‌లో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ మంజూరు బాండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కున్సి గ్రామ కాంగ్రెస్ బలగం పెద్ద సంఖ్యలో తరలివెళ్లి తమ సంఘీభావాన్ని చాటుకుంది.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని, భవిష్యత్తులో మిగిలిన హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఒంటరి మహిళలు, అక్కాచెల్లెళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వామినాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధప్ప మాస్టర్, బాడాల్ చిన్న నరసప్ప, ఖాన్దొడ్డి నారాయణ, గడ్డమీది శరణ్, నల్లె శ్రీనివాసులు, అలిగేరి మహదేవ్ జీ, లక్ష్మణ్, కాశీం, శివప్ప, నర్సింగప్ప తదితరులు పాల్గొన్నారు.

పింఛన్ బాండ్ల పంపిణీకి కదిలిన కున్సి కాంగ్రెస్ బలగం.. మక్తల్‌కు భారీగా తరలివెళ్లిన నాయకులు!

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *