మక్తల్‌లోని ద్వారక ఫంక్షన్ హాల్లో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్ మంజూరు బాండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కున్సి గ్రామ కాంగ్రెస్ బలగం పెద్ద సంఖ్యలో తరలివెళ్లి తమ సంఘీభావాన్ని చాటుకుంది.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని, భవిష్యత్తులో మిగిలిన హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఒంటరి మహిళలు, అక్కాచెల్లెళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వామినాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధప్ప మాస్టర్, బాడాల్ చిన్న నరసప్ప, ఖాన్‌దొడ్డి నారాయణ, గడ్డమీది శరణ్, నల్లె శ్రీనివాసులు, అలిగేరి మహదేవ్ జీ, లక్ష్మణ్, కాశీం, శివప్ప, నర్సింగప్ప తదితరులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్