Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

ఈ ప్రపంచం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఈ ప్రపంచం

వార్త ముఖ్యాంశాలు

  • "ఈ ప్రపంచం "నిన్ను ఏడిపిస్తుంది,ఎదురొడ్డి నిలబడగలవా..?
  • " ఈ ప్రపంచం "నిన్ను ద్వేషిస్తుంది,ధైర్యంతో దాటగలవా..?
  • "ఈ ప్రపంచం "నిన్ను తరుముతుంది, తరతరాలు గుర్తుండేలా తెగించగలవా..?

“ఈ ప్రపంచం “నిన్ను ఏడిపిస్తుంది,ఎదురొడ్డి నిలబడగలవా..?
” ఈ ప్రపంచం “నిన్ను ద్వేషిస్తుంది,ధైర్యంతో దాటగలవా..?
“ఈ ప్రపంచం “నిన్ను తరుముతుంది, తరతరాలు గుర్తుండేలా తెగించగలవా..?
“ఈ ప్రపంచం “నిన్ను ఒంటరిని చేస్తుంది,ఒంటి చేత్తో ఓటమిని ఓడించగలవా..?
“ఈ ప్రపంచం” నీకు అవమానమసిని పూస్తుంది,ఆత్మస్థైర్యంతో అంతులేని కసిని గుండెలో నిలుపగలవా..?
“ఈ ప్రపంచం ” నీ ఆలోచనలను ఆదిలోనే తృంచుతుంది,
ఆ ఆకాశవీధిలో నీ ఆలోచనలను పునర్నిర్మించగలవా..?
ఏదో ఒక రోజు ఏ.దో.ఒ.క.రో.జు..
“ఈ ప్రపంచం “నీ చావును కోరుకుంటుంది,కాలే నీ కట్టె పదిమందికి వెలుగవ్వాలని కోరుకోగలవా..?
అయితే పరిగెత్తు ఈ ప్రపంచాన్ని జయించడానికి
ఈ ప్రపంచం నిన్ను చిన్నచూపు చూస్తుంది ప్రతిచూపుకి చిరుత పులి అవ్వగలవా ఈ ప్రపంచం నీ ఆలోచనలకు
–కవి, రచయిత –కె. రెడ్డప్ప (భౌతికశాస్త్ర అధ్యాపకులు, DSR హై స్కూల్, అల్లూరు )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *