Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబం సభ్యులను పరామర్శించిన మాజీ ఎం పి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబం సభ్యులను పరామర్శించిన మాజీ ఎం పి

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామంలో వేముల లక్ష్మణ్ గౌడ్, ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బూర నర్సయ్య గౌడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఈ…

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలం కొన్ని గ్రామంలో వేముల లక్ష్మణ్ గౌడ్, ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బూర నర్సయ్య గౌడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు సౌడ రమేష్ బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ హత్య అని ఉద్యమకారులను ఆదుకోవడంలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న లక్ష్మణ్ గౌడ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశము కల్పించాలని తక్షణమే వారి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని వారి కుటుంబానికి 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారులకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను గుర్తించినట్టుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి పెన్షన్ అందించాలని భారతీయ జనతా పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బంగారు మహేష్ బిజెపి రాష్ట్ర నాయకులు పోడుగుల రమేష్, శ్రీ నివాస జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి,సద్ది సోమిరెడ్డి చంద్రమౌళి,నగేష్ ప్రధాన కార్యదర్శి రాజు సర్పంచులు పాండు బెజడి సిద్ధులు గీత సందీప్ రాష్ట్ర నాయకులు సురేష్ మాజీ ఎంపీటీసీ రాజు సురేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *