ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ అధ్యక్షతన మేధావుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూల వీరేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా తుళ్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ సర్ కు సంబంధించిన ప్రక్రియ ఎన్నికల కమిషన్కు సంబంధించిన అంశం అని దేశంలో సుమారుగా 13 కోట్ల 39 లక్షల మంది ఎలాంటి ఆధారము అడ్రస్ లేకుండా ఓటరుగా నమోదయి ఉన్నారని దాంట్లో వేల మంది చనిపోయిన ఓట్లు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయని కొన్నిచోట్ల ఒక వ్యక్తికి రెండు ఓట్లు నమోదయి ఉన్నాయని పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ప్రాంతాల నుంచి చొరబాటుదారులు ప్రవేశించి దేశాన్ని విచ్చిన్నకరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయని వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని తప్పకుండా అక్రమ చొరబాటుదారులను గుర్తించి ఎన్నికల కమిషన్ ఓట్లు తొలగిస్తుందని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మేధావులు పౌరులు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరుట్ల దశమంత రెడ్డి, రాష్ట్ర నాయకులు కే వి ఎల్ ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్ శివరాజ్ యాదవ్, బల్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమారాణి, ఐలోని అంజిరెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు మోర్చా అధ్యక్షులు మేధావులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు


