Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

ప్రకృతిని ప్రత్యక్షంగా పరిశీలించాలి: ప్రిన్సిపాల్ కేశవరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రకృతిని ప్రత్యక్షంగా పరిశీలించాలి: ప్రిన్సిపాల్ కేశవరావు

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం ఆధ్వర్యంలో బోటనీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు అరకు పైనరీ ఫారెస్ట్‌లో బొటానికల్ టూర్ నిర్వహించారు.
  • ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్.
  • కేశవరావు మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రకృతిని ప్రత్యక్షంగా పరిశీలించాలని, పర్యావరణ, జీవవైవిధ్య పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం ఆధ్వర్యంలో బోటనీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు అరకు పైనరీ ఫారెస్ట్‌లో బొటానికల్ టూర్ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రకృతిని ప్రత్యక్షంగా పరిశీలించాలని, పర్యావరణ, జీవవైవిధ్య పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అధ్యాపకులు బి.లచ్చన్న దొర వృక్షజాతులు, పైన్ చెట్ల ప్రత్యేకతలు, శాస్త్రీయ నామాలు, ఔషధ ప్రాధాన్యతను వివరించారు. అరకు రేంజ్ అటవీ అధికారులు అటవీ సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎన్ఎస్ఎస్ పీవోలు డా విజయలక్ష్మి, డా సుధీర్ పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *