వార్త ముఖ్యాంశాలు
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 5న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 11 మండలాల్లో వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు.
- రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, ప్రశాంతంగా లెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.
- మండలాల వారీగా కేంద్రాలు: అనంతగిరిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలురు), అరకు వ్యాలీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చింతపల్లిలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, డుంబ్రిగూడలో ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), జి.కె.వీధిలో ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, జి.మాడుగులలో ఆశ్రమ పాఠశాల (బాలురు–II),…
అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 5న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 11 మండలాల్లో వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, ప్రశాంతంగా లెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.
మండలాల వారీగా కేంద్రాలు: అనంతగిరిలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల (బాలురు), అరకు వ్యాలీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చింతపల్లిలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, డుంబ్రిగూడలో ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), జి.కె.వీధిలో ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, జి.మాడుగులలో ఆశ్రమ పాఠశాల (బాలురు–II), హుకుంపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొయ్యూరులో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, ముంచంగిపుట్టులో ఉద్యానవన శాఖ, డీఆర్‌డీఏ గోదాము, పాడేరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత భవనం, పెదబయలులో క్లారెషియన్ ఫాదర్స్ విద్యానికేతన్ బాలుర వసతి గృహం.
నిరంతర విద్యుత్, జనరేటర్, తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాల నిఘా, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు కల్పించాలని, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు కేంద్రాలను పరిశీలించి ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన