వార్త ముఖ్యాంశాలు
- డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని డిసెంబర్ 3వ తేదీ వరకు తాత్కాలికంగా…
- జిల్లాలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలిపారు.
- ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు.
డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని డిసెంబర్ 3వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ వెల్లడించారు.
జిల్లాలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 3 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. పీజీఆర్ఎస్ తాత్కాలిక నిలిపివేత విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.