Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

అయోధ్య రామయ్య పాదుకలకు ఏటికొప్పాకలో ఘన స్వాగతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అయోధ్య రామయ్య పాదుకలకు ఏటికొప్పాకలో ఘన స్వాగతం

వార్త ముఖ్యాంశాలు

  • భక్తి పారవశ్యంలో ఏటికొప్పాక..
  • వైభవంగా రాములవారి పాదుకల ఊరేగింపు ఏటికొప్పాక: అయోధ్య రామాలయం నుంచి శ్రీరాములవారి పాదుకలు మన ఏటికొప్పాక గ్రామానికి చేరుకోవడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
  • ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి గ్రామంలో శ్రీరాములవారి పాదుకల ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు.శ్రీరామ నామస్మరణలు, భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి.

భక్తి పారవశ్యంలో ఏటికొప్పాక.. వైభవంగా రాములవారి పాదుకల ఊరేగింపు

ఏటికొప్పాక: అయోధ్య రామాలయం నుంచి శ్రీరాములవారి పాదుకలు మన ఏటికొప్పాక గ్రామానికి చేరుకోవడంతో గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి గ్రామంలో శ్రీరాములవారి పాదుకల ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు.శ్రీరామ నామస్మరణలు, భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో గ్రామ వీధులు మార్మోగాయి. చెట్టు భజన, హరిభజన, తప్పెట్ల వాయిద్యాల నడుమ భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరేగింపును భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. పాదుకల దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా తరలివచ్చారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా, భక్తుల ఆనందోత్సాహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.గ్రామ ప్రజలు, భక్తుల సమిష్టి భాగస్వామ్యంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిసింది. శ్రీరాములవారి పాదుకలు ఏటికొప్పాకకు రావడం గ్రామానికి ఎంతో విశేషమైన ఆధ్యాత్మిక ఘట్టంగా భక్తులు భావించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *