Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

(పున్నమి ప్రతినిధి)వేముల, అక్టోబర్ 9:
వేముల మండలంలోని గొందిపల్లి, చాగలేరు గ్రామ పంచాయతీల పరిధిలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల (SWPC) వద్ద వర్మీ కంపోస్ట్ తయారీలో భాగంగా వర్మీ కంపోస్ట్ తొట్లలో వానపాములను విడుదల చేశారు. గ్రామాల్లో సేకరించే సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించి నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేయడంపై దృష్టి సారించాలని పంచాయతీ అభివృద్ధి అధికారులు (PDOలు), గ్రీన్ అంబాసిడర్లకు సూచించారు.

వర్మీ కంపోస్ట్ తయారీ ద్వారా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువులను అందుబాటులోకి తీసుకురావడం, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేలా ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలోని SWPC కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ వర్మీ కంపోస్ట్ తయారీని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

బిన్ బ్యాగ్ వినియోగంపై అవగాహన

గ్రామ ప్రజలకు బిన్ బ్యాగ్ విధానంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఇంటి నుంచి సేకరించే తడి చెత్తను గ్రీన్ అంబాసిడర్లకు అందించాలని, పొడి చెత్తను 15 రోజులకు ఒకసారి గ్రామానికి వచ్చే స్వచ్ఛ రథానికి ఇవ్వాలని ప్రజలకు వివరించాలన్నారు. స్వచ్ఛ రథం ద్వారా పొడి చెత్తను అందించే ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు పొందే విధానంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ అభివృద్ధి అధికారులు అనిల్, అనిదర్, స్థానిక రైతులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

సేంద్రియ వ్యర్థాలతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారీ గొందిపల్లి, చాగలేరులో SWPC కేంద్రాల వద్ద వానపాముల విడుదల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *