Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

సేవలకు వీడ్కోలు.. సత్యనారాయణకు ఘన సత్కారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సేవలకు వీడ్కోలు.. సత్యనారాయణకు ఘన సత్కారం

వార్త ముఖ్యాంశాలు

  • మునగపాకలో ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం మునగపాక: యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక గ్రామంలో గురువారం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు గారి భర్త ఆడారి సత్యనారాయణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
  • సుదీర్ఘకాలం విధుల్లో బాధ్యతాయుతంగా సేవలందించిన సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు.
  • మాజీ శాసనసభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, గొంతిన వెంకట హరీష్ గారు తదితరులు కార్యక్రమానికి హాజరై సత్యనారాయణ గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

మునగపాకలో ఘనంగా పదవీ విరమణ కార్యక్రమం

మునగపాక: యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక గ్రామంలో గురువారం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు గారి భర్త ఆడారి సత్యనారాయణ గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుదీర్ఘకాలం విధుల్లో బాధ్యతాయుతంగా సేవలందించిన సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందించారు. మాజీ శాసనసభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, గొంతిన వెంకట హరీష్ గారు తదితరులు కార్యక్రమానికి హాజరై సత్యనారాయణ గారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఆయన అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కుటుంబంతో ఆనందంగా గడుపుతూ సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *