వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్, అక్టోబర్ 8: ఢిల్లీలో ఎస్ఐఆర్ (SIR)కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ‘బ్లాక్ డే’ నిరసన…
- పీసీసీ, డీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు.
- ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాటించాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మల్, అక్టోబర్ 8: ఢిల్లీలో ఎస్ఐఆర్ (SIR)కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు.
పీసీసీ, డీసీసీ అధ్యక్షుల పిలుపు మేరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పాటించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ బాధ్యులు కుచాడి శ్రీహరి రావు, సారంగాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎం.డీ. జీషాన్ అలీ, మైనారిటీ సెల్ యువజన అధ్యక్షుడు ఏతేశ్యం, సీనియర్ నాయకులు ఎం.డీ. జాహెద్ అలీ, సబా కలీం, మజార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.