Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్ష

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
SIRకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్ష

వార్త ముఖ్యాంశాలు

  • ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్మల్‌లో ‘బ్లాక్ డే’ నిరసన నిర్మల్, అక్టోబర్ 8, పున్నమి ప్రతినిధి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్‌లో ‘బ్లాక్ డే’ నిరసన,…
  • ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపుతో, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం…
  • ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్మల్‌లో ‘బ్లాక్ డే’ నిరసన
నిర్మల్, అక్టోబర్ 8, పున్నమి ప్రతినిధి:
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్‌లో ‘బ్లాక్ డే’ నిరసన, నిరాహార దీక్ష చేపట్టారు.
ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపుతో, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల సవరణలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీల అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు.
ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
“ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల అసలైన బలం. ఓటు హక్కును కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అల్లు ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, నిర్మల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఆకుల హరీష్ కుమార్, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *