Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

, ఓటు హక్కును పరిరక్షించాలనే నినాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
, ఓటు హక్కును పరిరక్షించాలనే నినాదం

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్, అక్టోబర్ 9 (పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్): ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించాలనే నినాదంతో అక్టోబర్ 10, శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ’ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
  • ఏఐసీసీ పిలుపు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
  • ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నిర్మల్, అక్టోబర్ 9 (పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్):
ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించాలనే నినాదంతో అక్టోబర్ 10, శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చలో నిర్మల్ – సేవ్ డెమోక్రసీ’ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఏఐసీసీ పిలుపు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్టు చేసి, ఆయన రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ర్యాలీ వివరాలు..
అక్టోబర్ 10న శనివారం ఉదయం 11 గంటలకు నిర్మల్ మినీ ట్యాంక్ బండ్ వద్దనున్న అంబేద్కర్ చౌక్ నుంచి ర్యాలీ ప్రారంభమై, ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ పార్క్‌లోని గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, వివిధ కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థలు, ఆలయ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మండల అధ్యక్షులు, సర్పంచులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *