వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు కోరారు.
- ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కూటమి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆయన ఆరోపించారు.
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు కోరారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన కూటమి నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీ శనివారం ఉదయం 11 గంటలకు నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ చౌక్ నుంచి ప్రారంభమై ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈ ర్యాలీలో ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూచాడి శ్రీహరి రావు విజ్ఞప్తి చేశారు.