వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
కోనేటిరాయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు
పలమనేరు, అక్టోబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) :
గంగవరం మండలంలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన కీలపట్ల కోనేటిరాయ స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయ స్వామివారి ఉత్సవమూర్తులకు వైభవంగా
పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో పలు వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.
ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, అర్చన నిర్వహించారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు చేపటరు శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామివారికి, అమ్మవార్లకు విశేష అభిషేకం నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అనంతరం సాయంకాలం శ్రీదేవి భూదేవి సమేత కోనేటిరాయ స్వామి పవిత్ర మాలలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ
కంకణ బట్టు శ్రీకాంత్, ఖాద్రి నరసింహ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ మోహన రమణా మరియు వేదపండితులు అర్చకులు పాల్గొన్నారు.
Uploaded Video: