Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

కలికిరిలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కలికిరిలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

(సీఐ సాయిప్రసాద్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ముమ్మర పహారా)
(వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధుల్లో నిమగ్నమైన పోలీసు బలగాలు)
కలికిరి, అక్టోబర్ 21 (భాను ప్రసాద్ నాయుడు, పున్నమి న్యూస్ ప్రతినిధి):
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా కలికిరి మండల కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి తీసుకువచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) సాయిప్రసాద్ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా పోలీసులు గొడుగులు చేతబూని మండల కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద, సమీప వీధుల్లో గట్టి నిఘా ఉంచి నిరంతరం పహారా కాస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు వచ్చే అభ్యర్థులు, ప్రతిపాదకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. కార్యాలయం పరిసరాల్లో అపరిచిత వ్యక్తులు, అనధికార వాహనాలు గుమిగూడకుండా బారికేడ్లతో నియంత్రణ చేపట్టారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, నామినేషన్ల పర్వం ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు సహకరించాలని సీఐ సాయిప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

కలికిరిలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

కలికిరిలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

కలికిరిలో ఎంపీటీసీ నామినేషన్ల కేంద్రం వద్ద భారీ పోలీసు బందోబస్తు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *