Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

మాతృశిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మాతృశిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

వార్త ముఖ్యాంశాలు

  • గర్భిణులు, బాలింతలు, శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు.
  • జిల్లాలో రూ.1.14 కోట్లతో నిర్మించిన నాలుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ మండలవరం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
  • ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా నుంచి పాల్గొన్నారు.

గర్భిణులు, బాలింతలు, శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. జిల్లాలో రూ.1.14 కోట్లతో నిర్మించిన నాలుగు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ మండలవరం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్ జిల్లా నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మాతృ, శిశు ఆరోగ్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *