Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

మత్స్యకారులకు ఉచిత బియ్యం వెంటనే పంపిణీ చేయాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మత్స్యకారులకు ఉచిత బియ్యం వెంటనే పంపిణీ చేయాలి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) అచ్యుతాపురం, అక్టోబర్ 6: తుపాను పరిస్థితులతో జీవనోపాధి కోల్పోయిన తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని పూడిమడక మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు.
  • ఈ మేరకు మంగళవారం అచ్యుతాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి జూనియర్ అసిస్టెంట్ రాకేష్‌కు వినతిపత్రం అందజేశారు.
  • జిల్లా మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ పూడిమడకతో పాటు తంతడి, ముత్యాలమ్మపాలెం, తిక్కవాణిపాలెం, లోవపాలెం, గజ్జిరెడ్డిపాలెం తదితర తీర గ్రామాల్లో వేలాది కుటుంబాలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

అచ్యుతాపురం, అక్టోబర్ 6: తుపాను పరిస్థితులతో జీవనోపాధి కోల్పోయిన తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల ఉచిత బియ్యాన్ని తక్షణమే పంపిణీ చేయాలని పూడిమడక మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అచ్యుతాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి జూనియర్ అసిస్టెంట్ రాకేష్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మిడి అప్పారావు మాట్లాడుతూ పూడిమడకతో పాటు తంతడి, ముత్యాలమ్మపాలెం, తిక్కవాణిపాలెం, లోవపాలెం, గజ్జిరెడ్డిపాలెం తదితర తీర గ్రామాల్లో వేలాది కుటుంబాలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. వేట బంద్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు 50 కేజీల బియ్యం ప్రకటించి పది రోజులు దాటినా పంపిణీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తహశీల్దార్ ఉన్నతాధికారులతో మాట్లాడి బియ్యాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకారులు వాసుపల్లి రమణ, ఏరిపిల్లి అప్పన్న, కొండ్ల గణేష్, మద్దిల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *