వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా,తాళ్ళపూడి (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండలం కుక్కునూరు గ్రామంలో పింఛన్ చెల్లింపుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్‌పీడీవో బి.అమృతరాజు సోమవారం విచారణ చేపట్టారు.
- పింఛన్ పంపిణీకి సంబంధించిన అంశంపై ‘Way2News’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు.
- విచారణలో భాగంగా గ్రామంలో పింఛన్ల పంపిణీకి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లా,తాళ్ళపూడి (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండలం కుక్కునూరు గ్రామంలో పింఛన్ చెల్లింపుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఎన్‌పీడీవో బి.అమృతరాజు సోమవారం విచారణ చేపట్టారు. పింఛన్ పంపిణీకి సంబంధించిన అంశంపై ‘Way2News’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. విచారణలో భాగంగా గ్రామంలో పింఛన్ల పంపిణీకి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించారు. పింఛన్ సక్రమంగా చెల్లించనందుకు సంబంధిత సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ అంశంపై పూర్తి వివరాలు సేకరించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు విచారణలో పింఛన్ సక్రమంగా చెల్లించనట్లు నిర్ధారణ కావడంతో, సంబంధిత బాధ్యతలను పరిశీలించారు. ముఖ్యంగా సగం పింఛన్ మాత్రమే ఇచ్చినట్లు సచివాలయ ఉద్యోగి అంగీకరించినట్లు వార్తలో పేర్కొన్నారు. పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తాన్ని పూర్తిగా, ఎటువంటి కోతలు లేకుండా అందించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని అధికారులు స్పష్టం చేసినట్లు మరియు పింఛన్ సక్రమంగా చెల్లించనందుకు సంబంధిత సిబ్బందిపై చట్ట పరమైన చర్యలు తిసుకోనబడునని తెలిపియున్నారు.