వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అనకాపల్లి, అక్టోబర్ 5: అనకాపల్లి మండలంలో ఏఎంఆర్ సంస్థ అక్రమంగా టోల్గేట్లు ఏర్పాటు చేసి క్వారీల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ ఆరోపించారు.
- ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
- క్వారీల నుంచి తరలించే మెటీరియల్‌కు టన్నుకు రూ.170 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )
అనకాపల్లి, అక్టోబర్ 5: అనకాపల్లి మండలంలో ఏఎంఆర్ సంస్థ అక్రమంగా టోల్గేట్లు ఏర్పాటు చేసి క్వారీల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని సీపీఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్వారీల నుంచి తరలించే మెటీరియల్‌కు టన్నుకు రూ.170 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రాక్టర్లు, లారీలను బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతోందన్నారు. మండలంలో 130కుపైగా క్వారీలు ఉండగా, సుమారు 70 క్వారీల్లో మైనింగ్ జరుగుతోందని తెలిపారు. వాటిలో 15–20 క్వారీలకు మాత్రమే పూర్తి అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతులకు మించి మైనింగ్, సరైన రవాణా పర్మిట్లు లేకుండా మెటీరియల్ తరలింపు జరుగుతోందని ఆరోపించారు. ఏఎంఆర్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు తక్షణమే విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు.