Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

పునర్ జీవం పోసిన వైద్యులు మహదేవ ఆస్పటల్ జలగం రాంబాబు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పునర్ జీవం పోసిన వైద్యులు మహదేవ ఆస్పటల్ జలగం రాంబాబు

*పునర్జీవం పోసిన వైద్యులు*

*గుండె ఆగిపోయిన రోగికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన వైద్యులు*

*మైలవరం, అక్టోబర్: పున్నమి న్యూస్ ప్రతినిధి

మైలవరంలోని గ్రంథాలయంలో పనిచేస్తున్న రాంబాబు అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే శ్రీ మహాదేవ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో స్పందించి అత్యవసర వైద్యం అందించడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి.
హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంబాబు గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన కొద్ది సెకన్లలోనే కార్డియాక్ అరెస్ట్ (గుండె ఆగిపోవడం) సంభవించింది. పరిస్థితిని గుర్తించిన వైద్య బృందం వెంటనే అత్యవసర చికిత్స చేపట్టి, గుండెకు షాక్ ఇచ్చి తిరిగి స్పందించేలా చేశారు. అనంతరం ఆయన పరిస్థితిని కొంత స్థిరంగా ఉంచి, తదుపరి మెరుగైన కార్డియాక్ చికిత్స కోసం రమేష్ హాస్పిటల్‌కు తరలించారు.
రమేష్ హాస్పిటల్ వైద్యులు వెంటనే స్పందించి యాంజియోగ్రామ్ నిర్వహించి, అవసరమైన చోట స్టెంట్ అమర్చి చికిత్స అందించారు. దీంతో రాంబాబు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.
సకాలంలో స్పందించిన శ్రీ మహాదేవ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరిప్రసాద్, సిబ్బంది, అలాగే రమేష్ హాస్పిటల్ వైద్యుల సమన్వయంతో రాంబాబు ప్రాణాలు కాపాడటంపై కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయంలో వైద్యులు వేగంగా నిర్ణయం తీసుకుని చికిత్స అందించడం వల్లే ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.

పునర్ జీవం పోసిన వైద్యులు మహదేవ ఆస్పటల్ జలగం రాంబాబు

పునర్ జీవం పోసిన వైద్యులు మహదేవ ఆస్పటల్ జలగం రాంబాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *