ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಎನ್‌ಟಿಆರ್ ಜಿಲ್ಲೆ

వైద్య మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎల్ ఓ సి

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
వైద్య మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎల్ ఓ సి

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*

*వైద్య చికిత్సకు రూ.2.25 లక్షల ఎల్.ఓ.సీ. మంజూరు*

*ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫారసుతో పేద కుటుంబానికి వైద్య సాయం*

*రెడ్డిగూడెం, అక్టోబరు 5:*

*వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన కొనకళ్ల వీరబాబు కుటుంబానికి రూ.2.25 లక్షల విలువైన ఎల్.ఓ.సీ. మంజూరైంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫారసుతో మంజూరైన ఈ ఎల్.ఓ.సీ.ని గ్రామంలోని టీడీపీ నాయకులు లబ్ధిదారుడికి అందజేశారు.*

*పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాయకులు తెలిపారు. అవసరమైన సమయంలో వైద్య సహాయం అందేలా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు.*

*ప్రజలకు నిరంతరం అందుబాటులో ఎమ్మెల్యే కార్యాలయం*

*ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను స్వీకరించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వైద్య సహాయం, ఎల్.ఓ.సీ., ముఖ్యమంత్రి సహాయనిధి వంటి అంశాల్లో ప్రజలకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తూ విస్తృతమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.*

*వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి, సహాయనిధి మంజూరుకు సహకరించిన అధికారులకు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.*

*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

వైద్య మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎల్ ఓ సి

వైద్య మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎల్ ఓ సి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *