Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

విద్యుదగాతంతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, అక్టోబర్ 3:
జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామానికి చెందిన బుదిరెడ్డి దుర్గ సుబ్బారావు (34) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఆయిల్ పామ్ తోటలో పని చేస్తూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సుబ్బారావు శుక్రవారం యథావిధిగా పనిలోకి వెళ్లి విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు.సుబ్బారావు మృతి విషయం తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.విషయం తెలుసుకున్న జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని అండగా ఉంటామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, చల్లారామ్మూర్తి, చింతల కన్నారావు, గూడుపు నాగేశ్వరరావు, కొఠారి దుర్గాప్రసాద్, అడపా తాతాజీ, అడపా అబ్బాయి, బుదిరెడ్డి చక్రి తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *