Saturday, 3 October 2026
  • Home  
  • కల్లూరు రైస్ మిల్లులో అధికారుల ఆకస్మిక తనిఖీ
- నిర్మల్

కల్లూరు రైస్ మిల్లులో అధికారుల ఆకస్మిక తనిఖీ

అక్టోబర్ 02, నిర్మల్ పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సదరు రైస్ మిల్లులో 1,11,000 సంచులు (4,440 మెట్రిక్ టన్నులు) ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో 18,000 సంచులు (720 మెట్రిక్ టన్నులు) మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 93,000 సంచులు (3,720 మెట్రిక్ టన్నులు) ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. నిల్వల్లో వ్యత్యాసాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు తక్షణమే రైస్ మిల్లును, అలాగే మిల్లులో ఉన్న లారీలోని ధాన్యాన్ని సీజ్ చేశారు. రైస్ మిల్లర్ అందుబాటులో లేని కారణంగా నిబంధనల ప్రకారం శనివారం పంచనామా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వరి ధాన్యం విషయంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో తహసిల్దార్ కమల్ సింగ్‌తో, రెవెన్యూ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

అక్టోబర్ 02, నిర్మల్ పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం సదరు రైస్ మిల్లులో 1,11,000 సంచులు (4,440 మెట్రిక్ టన్నులు) ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో 18,000 సంచులు (720 మెట్రిక్ టన్నులు) మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 93,000 సంచులు (3,720 మెట్రిక్ టన్నులు) ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

నిల్వల్లో వ్యత్యాసాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు తక్షణమే రైస్ మిల్లును, అలాగే మిల్లులో ఉన్న లారీలోని ధాన్యాన్ని సీజ్ చేశారు. రైస్ మిల్లర్ అందుబాటులో లేని కారణంగా నిబంధనల ప్రకారం శనివారం పంచనామా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

వరి ధాన్యం విషయంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో తహసిల్దార్ కమల్ సింగ్‌తో, రెవెన్యూ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.