Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

అమలాపురం పార్లమెంట్ సమన్యయకర్తగా. పి గన్నవరం ఎమ్మెల్యే. గిడ్డి సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ను జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియమించారు నూతనంగా ప్రకటించిన సమన్వయ కమిటీ సభ్యులకు,నిర్వాహక దళ్…
  • అమలాపురం పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు,కార్యకర్తల సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
  • పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ను జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియమించారు నూతనంగా ప్రకటించిన సమన్వయ కమిటీ సభ్యులకు,నిర్వాహక దళ్ సభ్యులకు,సపోర్ట్ టీమ్‌కు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు,కార్యకర్తల సమన్వయంతో పనిచేస్తానని పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *