Saturday, 3 October 2026

Tag: Nirmal collector

నిర్మల్

బొంద్రేడ్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. పలు హామీలిచ్చిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు

అక్టోబర్ 3 నిర్మల్ పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా తానూర్ మండల్ లో రైతు బిడ్డగా.. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తమ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారికి బొంద్రేడ్ గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఎడ్లబండిపై ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారిని గ్రామంలోకి తీసుకొచ్చి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మహిళా సమైక్య సంఘ భవనం నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే.. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభించారు. అలాగే రూ.21 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ.. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు బొంద్రేడ్ నుంచి బోసి వరకు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. NH-61 నుంచి హమ్రూసర్ గుట్ట వరకు రహదారి నిర్మాణాన్నిమంజూరుచేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తానూర్ మండల రైతులకు ఎంతో కీలకమైన వ్యవసాయ రంగంలోని 28వ ప్యాకేజీ అంశాన్ని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. 28వ ప్యాకేజీ అమలైతే మండలంలోని రైతులకు గణనీయమైన ప్రయోజనంచేకూరుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి , తన వంతు కృషి కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్యం ఇరిగేషన్.. మౌలిక వసతులే లక్ష్యమని ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మౌలిక వసతులుఅందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ముధోల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. ఇకపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందేలా చర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. Uploaded Video:

నిర్మల్

కల్లూరు రైస్ మిల్లులో అధికారుల ఆకస్మిక తనిఖీ

అక్టోబర్ 02, నిర్మల్ పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లులో ధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సదరు రైస్ మిల్లులో 1,11,000 సంచులు (4,440 మెట్రిక్ టన్నులు) ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో 18,000 సంచులు (720 మెట్రిక్ టన్నులు) మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో 93,000 సంచులు (3,720 మెట్రిక్ టన్నులు) ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. నిల్వల్లో వ్యత్యాసాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు తక్షణమే రైస్ మిల్లును, అలాగే మిల్లులో ఉన్న లారీలోని ధాన్యాన్ని సీజ్ చేశారు. రైస్ మిల్లర్ అందుబాటులో లేని కారణంగా నిబంధనల ప్రకారం శనివారం పంచనామా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వరి ధాన్యం విషయంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో తహసిల్దార్ కమల్ సింగ్‌తో, రెవెన్యూ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.