ఖమ్మం, అక్టోబర్ 3: బీజేపీ యువమోర్చా ఖమ్మం జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు ససనాల శ్రీరామ్ ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 2న నూతన కమిటీని ప్రకటించినట్లు వెల్లడించారు.
జిల్లా వైస్ ప్రెసిడెంట్లుగా గుగులోత్ సోమా, కొమ్మ మధు యాదవ్, మండ చందర్శేఖర్ గౌడ్, బానోత్ పృథ్వీ నియమితులయ్యారు. జిల్లా జనరల్ సెక్రటరీలుగా దీకొండ శ్యామ్ సుందర్, గుత్తా నాగేంద్రబాబులను నియమించారు.
జిల్లా కార్యదర్శులుగా దుపాటి వెంకటరాజు, మార్తా భార్గవ్, గడ్డల కళ్యాణ్ కుమార్, మక్కల వీరబాబు, దుగ్గిదేవర మాణికంఠలను, కోశాధికారిగా ఆకుల నరేష్ గుప్తాను నియమించారు. జిల్లా మన్ కీ బాత్ కన్వీనర్‌గా కొత్తపల్లి నవీన్ కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా చెన్నబోయిన ఉదయ్ కిరణ్ నియమితులయ్యారు.
నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు.


