Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అంబూరు గ్రామ పంచాయతీలో పూరి గుడిసె దగ్ధం

అంబూరు: వరదయ్యపాలెం మండలం అంబూరు గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం రాత్రి పూరి గుడిసెలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది.

మంటలు వేగంగా వ్యాపించడంతో గుడిసెలోని గృహోపకరణాలు, వస్తువులు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌ లేదా ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సంబంధిత వివరాలు సేకరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *