కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ (పున్నమి న్యూస్):
కూటమి ఐక్యతకు నిదర్శనంగా పెద్దాపురం నియోజకవర్గంలో శుక్రవారం ఆత్మీయ కలయిక జరిగింది.నూతనంగా జనసేన పార్టీలో చేరిన పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, పెద్దాపురం మాజీ కౌన్సిలర్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే చినరాజప్పకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ కూడా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు,డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఈ కలయిక జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.
కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం,ఐక్యత మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.కూటమి ఐక్యతను చాటిచెప్పే విధంగా ప్రతి కార్యక్రమంలో పరస్పర సహకారంతో పాల్గొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అరెల్లి వీర రాఘవ, వాసంశెట్టి గంగ, కట్టా రాజబాబు, చింత శ్రీను, తాడి శేఖర్, పెన్నింటి రాము, నీలంశెట్టి పండు, యండమూరి పెద్ద, బొక్కిన సుబ్బారావు, కోటి మల్లిబాబు, నల్ల శ్రీను,పబ్బు వేణు, వేగి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

*కూటమి ఐక్యతకు నిదర్శనంగా ఆత్మీయ కలయిక*
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ (పున్నమి న్యూస్): కూటమి ఐక్యతకు నిదర్శనంగా పెద్దాపురం నియోజకవర్గంలో శుక్రవారం ఆత్మీయ కలయిక జరిగింది.నూతనంగా జనసేన పార్టీలో చేరిన పెద్దాపురం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, పెద్దాపురం మాజీ కౌన్సిలర్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే చినరాజప్పకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్ కూడా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు,డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఈ కలయిక జరిగింది. ఈ సందర్భంగా నాయకులు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం,ఐక్యత మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.కూటమి ఐక్యతను చాటిచెప్పే విధంగా ప్రతి కార్యక్రమంలో పరస్పర సహకారంతో పాల్గొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అరెల్లి వీర రాఘవ, వాసంశెట్టి గంగ, కట్టా రాజబాబు, చింత శ్రీను, తాడి శేఖర్, పెన్నింటి రాము, నీలంశెట్టి పండు, యండమూరి పెద్ద, బొక్కిన సుబ్బారావు, కోటి మల్లిబాబు, నల్ల శ్రీను,పబ్బు వేణు, వేగి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

