Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

రూ.416.95 లక్షల నిధులతో ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీకి భూమిపూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రూ.416.95 లక్షల నిధులతో ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీకి భూమిపూజ

రూ.416.95 లక్షల నిధులతో ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీకి భూమిపూజ

కడప, అక్టోబర్ 2 (పునమి ప్రతినిధి):

కడప నగరంలోని ఓల్డ్ రిమ్స్ ప్రాంగణంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఆయుష్ మిషన్ కింద రూ.416.95 లక్షల నిధులతో మంజూరైన ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కాలేజీ అప్‌గ్రేడేషన్ నూతన భవన నిర్మాణ బ్లాక్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో ప్రజారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, వైద్య విద్యార్థులకు అత్యాధునిక మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నూతన హోమియోపతి మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పరిశోధనలకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఏపీఎంఐడీసీ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *