Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఆసుపత్రిలో ఉన్నా.. పెన్షన్‌కు కొదవలేదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆసుపత్రిలో ఉన్నా.. పెన్షన్‌కు కొదవలేదు

వార్త ముఖ్యాంశాలు

  • కొక్కిరాపల్లిలో లబ్ధిదారుకు ఆసుపత్రికే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేత పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో) యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి నివాసి అగ్రహారపు అప్పలనర్స మామ ఇటీవల ఇంటి వద్ద జారి పడటంతో కాలికి గాయం కావడంతో…
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా ఆమెకు పెన్షన్ అందజేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోవడాన్ని వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి సోదరి గుర్తించారు.
  • విషయం తెలుసుకున్న ఆమె విధి నిర్వహణలో భాగంగా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అగ్రహారపు అప్పలనర్స మామ వద్దకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేశారు.

కొక్కిరాపల్లిలో లబ్ధిదారుకు ఆసుపత్రికే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేత

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)

యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ 23వ వార్డు కొక్కిరాపల్లి నివాసి అగ్రహారపు అప్పలనర్స మామ ఇటీవల ఇంటి వద్ద జారి పడటంతో కాలికి గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో భాగంగా ఆమెకు పెన్షన్ అందజేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోవడాన్ని వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి సోదరి గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆమె విధి నిర్వహణలో భాగంగా అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అగ్రహారపు అప్పలనర్స మామ వద్దకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేశారు.
కష్టకాలంలో తమకు అండగా నిలిచి ఆసుపత్రికే వచ్చి పెన్షన్ అందించినందుకు కుటుంబ సభ్యులు సోదరికి కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో నిస్వార్థంగా, పారదర్శకంగా సేవలందించిన సోదరిని పలువురు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *