దుత్తలూరు: మండలంలోని నర్రవాడకు చెందిన బాల కార్మికుడు రామయ్య కుటుంబానికి అధికారులు అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామయ్య తల్లిదండ్రులకు నివేశ స్థలం మంజూరు చేసి తహశీల్దార్ నాగరాజు పట్టాను అందజేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ద్వారా రామయ్య పరిస్థితి అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించిన అధికారులు బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తాజాగా కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తూ నివేశ స్థలం మంజూరు చేశారు. రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి పట్టాను అందజేశారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు. పట్టా అందడంపై రామయ్య తల్లిదండ్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

రామయ్య కుటుంబానికి సొంతింటి బాట.. నివేశ స్థల పట్టా అందజేత