వింజమూరు: పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. వింజమూరు పట్టణంలోని సిద్ధార్థనగర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా.. పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్