Friday, 2 October 2026
  • Home  
  • ఎమ్మెల్సీ ఎన్నికలపై ఖానాపూర్ మండల నాయకుల సమావేశం
- వరంగల్

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఖానాపూర్ మండల నాయకుల సమావేశం

ఖానాపూర్ మండలంలో వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టడం, అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం, గ్రామాల వారీగా ఓటర్ల వివరాలను సేకరించి సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, గ్రామస్థాయిలో ఓటర్లను సమీకరించడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పట్టభద్ర ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించి, కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మాజీ AMC చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మహాలక్ష్మి వెంకట నరసయ్య,రామసాయం ఉపేందర్ రెడ్డి,ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, కోరే సుధాకర్, పులిగిల్ల యాదగిరి బుస అశోక్, బందారపు శ్రీనివాస్ గౌడ్, అబోత్ అశోక్,యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రాము, తోట రవి ముద్దంగుల సంపత్ గంగాపురం అనిల్ పోతారాజు దేవేందర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఖానాపూర్ మండలంలో వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండల నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టడం, అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం, గ్రామాల వారీగా ఓటర్ల వివరాలను సేకరించి సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించారు.
అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, గ్రామస్థాయిలో ఓటర్లను సమీకరించడం, పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు చర్చించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పట్టభద్ర ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించి, కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు,మాజీ AMC చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మహాలక్ష్మి వెంకట నరసయ్య,రామసాయం ఉపేందర్ రెడ్డి,ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, కోరే సుధాకర్, పులిగిల్ల యాదగిరి బుస అశోక్, బందారపు శ్రీనివాస్ గౌడ్, అబోత్ అశోక్,యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రాము, తోట రవి ముద్దంగుల సంపత్ గంగాపురం అనిల్ పోతారాజు దేవేందర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.