Thursday, 1 October 2026
  • Home  
  • ఓబనపల్లిలో పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
- తిరుపతి

ఓబనపల్లిలో పశువుల షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

రైల్వేకోడూరు: మండలంలోని ఓబనపల్లి పంచాయతీ కంచెమ్మ ఎస్టీ కాలనీలో పల్లె పండుగ–3.0లో భాగంగా పశువుల షెడ్డు నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. వి.బి.జి. రామ్‌జీ నిధులతో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పశువులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో పశుపోషకులకు ప్రయోజనం చేకూరుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.