Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

పేదలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ పెన్షన్లు ఇర్రిపాక పెన్షన్లుపంపిణీ జ్యోతుల నవీన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పేదలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ పెన్షన్లు ఇర్రిపాక పెన్షన్లుపంపిణీ జ్యోతుల నవీన్

వార్త ముఖ్యాంశాలు

  • *పేదలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ పింఛన్లు - ఇర్రిపాకలో పంపిణీ చేసిన జ్యోతుల నవీన్* కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్1: జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గురువారం ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
  • కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.
  • *ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ:* - వృద్ధులకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు, అనారోగ్య బాధితులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు ఆర్థిక భరోసాగా ఉపయోగపడుతున్నాయి.

*పేదలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ పింఛన్లు – ఇర్రిపాకలో పంపిణీ చేసిన జ్యోతుల నవీన్*

కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్1: జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో గురువారం ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.

*ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ:*

– వృద్ధులకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు, అనారోగ్య బాధితులకు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు ఆర్థిక భరోసాగా ఉపయోగపడుతున్నాయి.

– ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోంది.

– కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లను భారీగా పెంచింది. వృద్ధులకు 3000 నుండి 4000 రూపాయలకు, విభిన్న ప్రతిభావంతులకు 3000 నుండి 6000 రూపాయలకు, మంచానికే పరిమితమైన వారికి 10,000 నుండి 15,000 రూపాయలకు పెంచి పేదలకు అండగా నిలిచింది.

– 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే గౌరవంగా పెన్షన్ అందిస్తుండటం ప్రజా ప్రభుత్వానికి నిదర్శనం.

ఈ కార్యక్రమంలో బస్వా చిన్న బాబు, జ్యోతుల నాగబాబు, జ్యోతుల సత్యమూర్తి, కేసినిడి అప్పారావు, కోనేటి వెంకటేశ్వరరావు సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *