గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన కాకినాడ జిల్లా పోలీసులు – 5 కేజీల లిక్విడ్ గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ ఎం. కిషోర్ కుమార్ గారి సూచనలతో, పెద్దాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి శ్రీ ఏ.బి.జి. తిలక్ గారి పర్యవేక్షణలో , జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. తిరుపతి రావు గారి ఆధ్వర్యంలో గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్-16 జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను గండేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 5 కేజీల లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్), రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు:- తేదీ 20.11.2026 ఉదయం గంజాయిని రెండు కార్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం గండేపల్లి పోలీసులకు అందింది. ఈ సమాచారాన్ని గండేపల్లి ఎస్ఐ శ్రీ U.V. శివ నాగబాబు గారు ఉన్నతాధికారులకు తెలియజేసి, చట్టప్రకారం అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు. అనంతరం మధ్యవర్తులు, పోలీసు సిబ్బంది కలిసి గండేపల్లి మండలం Z. రాగంపేట గ్రామ సమీపంలో NH-16 రహదారిపై తనిఖీలు నిర్వహించారు. నిందితుల అరెస్టు:- తేదీ 20.11.2026 ఉదయం సుమారు 08.00 గంటలకు Z. రాగంపేట గ్రామ సమీపంలోని Tea Tree షాపు ఎదురుగా రెండు కార్లతో అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు వ్యక్తులు గంజాయి మార్పిడి జరుగుతున్న సమయంలో గండేపల్లి ఎస్ఐ మరియు సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు 1. లిక్విడ్ గంజాయి (Hashish Oil) – 5 కేజీలు (ఐదు ప్యాకెట్లు). 5 కేజీలు × ₹12,50,000/- = ₹62,50,000/ 2. మారుతి సుజుకి కారు – AP40DR2388. (2,50,000/-) 3. హోండా అమేజ్ కారు – AP40MC0490. (2,50,000/-) 4. ఆరు సెల్ఫోన్లు. 6 × ₹5,000/- = ₹30,000/- 5. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ ₹67,80,000/-


వార్తా మూలాలు
- Press meetపత్రికా ప్రకటన