నంద్యాల: 2026–27 ఆర్థిక సంవత్సరానికి వివిధ శాఖలకు నిర్దేశించిన రెవెన్యూ లక్ష్యాలను సమన్వయంతో సాధించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ వసూళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీగా లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతి, బకాయిల వసూళ్ల పరిస్థితిని సమీక్షించారు.బకాయిల వసూళ్లకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ అంతరశాఖ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యాల సాధనకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో వాణిజ్య పన్నులు, పోలీస్, గనులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా, విద్య, ట్రెజరీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రెవెన్యూ లక్ష్యాలపై దృష్టి బకాయిల వసూళ్లు వేగవంతం చేయాలి