డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని జనుపల్లి గ్రామంలో మురుగు కాలువ సమస్యపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలకు ఆనుకుని ప్రవహిస్తున్న మురుగు కాలువ చెత్తాచెదారంతో పూడుకుపోవడంతో నీరు పొంగి పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వైఎస్సార్సీపీ అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుల పక్షాన నిలబడి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. అవసరమైతే రైతుల కోసం పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హామీ ఇచ్చారు.
అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ దొరను అవమానించడం దురదృష్టకరమని కూటమి ప్రభుత్వనికి హెచ్చరికలు జారీ చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర బూత్ కమిటీ వింగ్ సెక్రటరీ, ఏఎంసీ మాజీ డైరెక్టర్ చేట్ల రామారావు తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Uploaded Video:

