కృష్ణ మండలం: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన డిగ్రీ పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీజేపీ కృష్ణ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప కోరారు. 2023 నాటికి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత పూర్తి చేసిన వారు, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు కూడా ఈ నెల 6వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ జిరాక్స్‌తో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సమర్పించి, గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ అనంతరం సంబంధిత పత్రాలను మండల తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న పట్టభద్రులు, స్వయం ఉపాధి పొందుతున్న విద్యావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ బట్, బీజేవైఎం మండల అధ్యక్షులు ఓట్టేవొళ్ల సురేష్, అజిత్ దీక్షిత్ పాల్గొన్నారు.

డిగ్రీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసుకోవాలి బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప