ఉదయగిరి, సెప్టెంబర్ 29 : పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయగిరి నియోజకవర్గానికి తొలిసారి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్‌కు జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
వరికుంటపాడు మండలం రామాపురంలో నిర్వహించిన కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన జనసేన శ్రేణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనసేన పార్టీ రంగులతో కూడిన గొడుగులను వినూత్నంగా అమర్చి “WELCOME TO UDAYAGIRI PAWAN KALYAN SIR” అంటూ స్వాగత సందేశాన్ని ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి తీసిన దృశ్యాల్లో ఈ స్వాగత సందేశం స్పష్టంగా కనిపించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉదయగిరి వేదికగా పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా రూ.11,085 కోట్ల విలువైన పనులకు ఈ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టినట్లు వార్తా సంస్థలు నివేదించాయి.
కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు చేపట్టిన ఈ వినూత్న స్వాగత ఏర్పాట్లు కార్యక్రమానికి వచ్చిన వారి దృష్టిని ఆకర్షించాయి.
Uploaded Video:


