సాలూరు, సెప్టెంబర్ 29:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సాలూరు పట్టణంలోని సమస్యాత్మక వార్డులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, స్థానిక రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పోలీసులు తటస్థంగా, సమన్వయంతో వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు
సాలూరు, సెప్టెంబర్ 29: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సాలూరు పట్టణంలోని సమస్యాత్మక వార్డులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, స్థానిక రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పోలీసులు తటస్థంగా, సమన్వయంతో వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు, ఎస్ఐ అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

