వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) యలమంచిలి : నాన్హి కాలీ ప్రాజెక్ట్ ద్వారా ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థినులకు స్పోర్ట్స్ షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
- నాంధి ఫౌండేషన్లో స్కిల్ అసోసియేట్గా పనిచేస్తున్న ఎర్రంసెట్టి శ్యామలాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
- పాఠశాల హెచ్ఎం ఎం.
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )
యలమంచిలి : నాన్హి కాలీ ప్రాజెక్ట్ ద్వారా ఏటికొప్పాక గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్లో విద్యార్థినులకు స్పోర్ట్స్ షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నాంధి ఫౌండేషన్లో స్కిల్ అసోసియేట్గా పనిచేస్తున్న ఎర్రంసెట్టి శ్యామలాదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పాఠశాల హెచ్ఎం ఎం. రమణ, ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో నాంధి ఫౌండేషన్ తరఫున బాలికలకు స్పోర్ట్స్ షూస్ అందజేశారు. బాలికలను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు, వారి అవసరాలకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.