Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది.. ఏటికొప్పాక ఎంపీయూపీ స్కూల్‌లో ఎస్‌ఎంసీ ఏకగ్రీవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది.. ఏటికొప్పాక ఎంపీయూపీ స్కూల్‌లో ఎస్‌ఎంసీ ఏకగ్రీవం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్‌ఎంసీ చైర్మన్‌గా బొడ్డేటి నూకరాజు వైస్‌ చైర్మన్ గా తల్లా జ్యోతి పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో ) ఏటికొప్పాక: విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమనే ఉద్దేశంతో ఏటికొప్పాక ఎంపీయూపీ పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా…
  • చైర్మన్‌గా బొడ్డేటి నూకరాజు (జనసేన), వైస్ చైర్మన్‌గా తల్లా జ్యోతి (టీడీపీ) ఎన్నికయ్యారు.
  • పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన వసతులు, క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం, పాఠశాల సమగ్ర అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఎస్‌ఎంసీ చైర్మన్‌గా బొడ్డేటి నూకరాజు వైస్‌ చైర్మన్ గా తల్లా జ్యోతి

పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో )

ఏటికొప్పాక: విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమనే ఉద్దేశంతో ఏటికొప్పాక ఎంపీయూపీ పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. చైర్మన్‌గా బొడ్డేటి నూకరాజు (జనసేన), వైస్ చైర్మన్‌గా తల్లా జ్యోతి (టీడీపీ) ఎన్నికయ్యారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన వసతులు, క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం, పాఠశాల సమగ్ర అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే విద్యార్థుల ప్రతిభను మరింత వెలికితీయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అన్నం బాబ్జి, కాండ్రకోట చిరంజీవి, అన్నం స్వరాజీరావు, రావి చలపతి, గొంతుమూర్తి కొండయ్య, నాయుడు, దారా పోలిశెట్టి, కూటమి సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *