ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం, విశేష అర్చనలు, విద్యుత్ దీపాలంకరణ, మంగళ వాయిద్యాల నడుమ వేడుకలు జరిగాయి. స్వామివారి పవిత్ర లడ్డూను బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు రూ.5.15 లక్షలకు దక్కించుకున్నారు. వెయ్యి రూపాయల నోట్ల మాలను యారాసి రవికుమార్–శివలక్ష్మి దంపతులు రూ.2.50 లక్షలకు, ఐదు రూపాయల నాణేల మాలను చెన్నూరు కరుణాకర్ రెడ్డి–దీప దంపతులు రూ.30 వేలకు దక్కించుకున్నారు. ఉభయదాతలుగా గంధళ్ల కృష్ణయ్య–అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.

వినాయక లడ్డూకు రికార్డు ధర
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి) మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో వినాయక నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం, విశేష అర్చనలు, విద్యుత్ దీపాలంకరణ, మంగళ వాయిద్యాల నడుమ వేడుకలు జరిగాయి. స్వామివారి పవిత్ర లడ్డూను బండేపల్లి గ్రామానికి చెందిన మేకల యోగేశ్వరరావు రూ.5.15 లక్షలకు దక్కించుకున్నారు. వెయ్యి రూపాయల నోట్ల మాలను యారాసి రవికుమార్–శివలక్ష్మి దంపతులు రూ.2.50 లక్షలకు, ఐదు రూపాయల నాణేల మాలను చెన్నూరు కరుణాకర్ రెడ్డి–దీప దంపతులు రూ.30 వేలకు దక్కించుకున్నారు. ఉభయదాతలుగా గంధళ్ల కృష్ణయ్య–అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు.

