వార్త ముఖ్యాంశాలు
- నర్సంపేట: భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో నెలకొన్న అసమానతలు, అన్యాయాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని SFI వరంగల్ జిల్లా కార్యదర్శి పైసా గణేష్ పిలుపునిచ్చారు.
- సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు.
- SFI జిల్లా కమిటీ సభ్యుడు వసీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పైసా గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
నర్సంపేట: భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో నెలకొన్న అసమానతలు, అన్యాయాలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని SFI వరంగల్ జిల్లా కార్యదర్శి పైసా గణేష్ పిలుపునిచ్చారు.
సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. SFI జిల్లా కమిటీ సభ్యుడు వసీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పైసా గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
భగత్ సింగ్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాకుండా సమానత్వం, స్వేచ్ఛ, శాస్త్రీయ దృక్పథం కోసం పోరాడిన గొప్ప విప్లవకారుడని అన్నారు. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి విద్యార్థుల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు. నేటి విద్యార్థులు ఆయన ఆలోచనలను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. విద్యార్థి సమస్యల పరిష్కారానికి SFI ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో SFI నాయకులు మణికంఠ, దినేష్, అఖిల్, సింధు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.