ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపూర్ మండలం
దబ్బీర్ పేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీ ఈక కొమ్మయ్య అనారోగ్యంతో వరంగల్ MGM హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని మాజీ MPP శ్రీ వేములపల్లి ప్రకాష్ రావు , ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్ , మాజీ సర్పంచ్ శ్రీ బానోత్ రాజు , ఉప సర్పంచ్ శ్రీ అన్నమనేని రవీందర్రావు . హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాజీ సర్పంచ్ కొమ్మయ్య త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోరారు.
అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
