వార్త ముఖ్యాంశాలు
- వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో, డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (DHRC NGO) ప్రతినిధులు ఎంజీఎం ఆసుపత్రిలోని సమస్యలపై అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
- జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్, హన్మకొండ జిల్లా చైర్మన్ పద్మ మహిపాల్ ఈ ఫిర్యాదును అందజేశారు.
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో, డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (DHRC NGO) ప్రతినిధులు ఎంజీఎం ఆసుపత్రిలోని సమస్యలపై అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్, హన్మకొండ జిల్లా చైర్మన్ పద్మ మహిపాల్ ఈ ఫిర్యాదును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలకు దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రిలో గత రెండేళ్లుగా సరైన సౌకర్యాలు లేక రోగులు తీవ్ర అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడటం, ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రత పెరగడం, సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఏసీలు, లిఫ్టులు సరిగా పనిచేయకపోవడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చికిత్స పొందుతున్నారని తెలిపారు.ఈ తీవ్ర పరిస్థితులపై తక్షణమే స్పందించి, ఆసుపత్రిని మెరుగుపరిచి సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో DHRC ప్రతినిధులు తులసి కళ్యాణి, బైరి రాధిక, బి. లక్ష్మణ్, నూనె రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.